دانلود کتاب Kagadaga Veligina Kshanam
by MSR
|
عنوان فارسی: Kagadaga Veligina Kshamam |
دانلود کتاب
جزییات کتاب
ఇది ఒక చేగువేరా డైరీ, భగత్ సింగ్ డైరీ లాంటిదే. తను కలిసిన కార్మికుల గురించి చదువుకున్న పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి కవిత్వంతో పాటుగా రాసుకున్న ఓ విప్లవ యోధుని డైరీ. 22 ఏళ్ళకే లేలేత ప్రాయంలో ఇంజినీరింగ్ చదువును మధ్యలో వదిలి వచ్చి విప్లవ కార్యకర్తగ పూర్తికాలం కార్మికోద్యమంలో పనిచేసిన శ్రీనివాసరావు ఉరఫ్ కరుణాకర్ ఉరఫ్ ప్రభాకర్ ని బొల్లారం దగ్గర ఇంకో మిత్రునితో పట్టుకుని సెప్టెంబర్ 3, 1992న రాజ్యం తనని పాశవికంగా చిత్రహింసల పాల్జేసి హత్యచేసింది. పిరికిపందలా తన పేరుని కాని, ఊరుని కానీ ప్రకటించకుండా కనీసం ప్రాధమికంగా పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా ఏం చేసారో తెలీకుండా మాయం చేసింది. అంతలా ఉద్యమానికి ఊపిర్లూది సిటీ కార్మికోద్యమానికి వెన్ను దన్నుగా పనిచేసిన ఈ శీను మనసు తన కవితలలో ఇలా మనముందు వుంచుతాడు.